చట్టాలు... ఏ దేశానికైనా వెన్నెముక లాంటివి. చట్టం లేకుండా ఏ వ్యవహారమూ ముదుకు సాగదు. మంచి చట్టాలు కలిగిన దేశం అన్ని రంగాలలో ముందుంటుంది. న్యాయ శాస్త్ర గ్రంథాలన్నీ ఇంగ్లీషు లో నే వున్నాయి. న్యాయశాస్త్ర గ్రంథాలు సామన్యులకు అందుబాటులో లేక పోవడం వల్ల చట్టమంటే ఒకరకమైన భయం సామాన్యులలో వుంది. చదువుకున్న వారు సైతం చట్టం పట్ల సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి వ్యక్తీ ఏదో ఒక సందర్భం లో న్యాయ సహాయం కొరకో, లేక న్యాయ సలహా కొరకో న్యాయవాదులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదుర్కుంటూ వుంటారు. చాలా మంది ప్రజలు చట్టాల పట్ల అవగాహన లేక తమ హక్కులను కోల్పోతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తమకు అవసరమైనప్పుడు, అన్యాయం జరిగినప్పుడు చట్టం తెలియక ఇబ్బందులు తమ ఖర్మలే.. అనుకునే వారు కూడా చాలామంది వున్నారు. అలాంటి వారి కొరకు మాతృభాషలో చట్టాల గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యం తో ఈ బ్లాగును ప్రారంభిస్తున్నాను. న్యాయశాస్త్రం చదువుకున్నందుకు ఇలాంటి ఒక బ్లాగు నిర్వహించమని చాలామంది మిత్రులు నన్ను ప్రోత్సహించారు. నాకు తెలిసిన గోరంత న్యాయశాస్త్ర విజ్ఞానం ఏ కొద్దిమందికి ఉపయోగపడినా అది నా అదృష్టంగా భావిస్తాను. ఆ అదృష్టాన్ని ప్రాసాదించమని భగవంతుడిని సవినయంగా వేడుకుంటున్నాను.
-నిర్వాణి
No comments:
Post a Comment